ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్‌బర్గ్‌ని ఉరితీసి చంపాలని కోరుకున్నది ఎవరు? ఫేస్‌బుక్ తో ప్రపంచాన్ని కుగ్రామంలో మార్చేసి మనుషులను దగ్గర చేసిన జుకర్‌బర్గ్ వ్యవహారంలో ఇంత క్రూరాతిక్రూరమైన ఆలోచన ఎవరిది? అంటే ఓ పాకిస్థాన్ తీవ్రవాదిది. జుకర్‌బర్గ్ స్వయంగా ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్ పేజీలో పేర్కొన్నారు.
ప్యారిస్ నగరంలోని ఓ పత్రిక కార్యాలయం పైన ఉగ్రవాదులు దాడి చేసి 12 మందిని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిన విషయమే. దీనిపై జుకెర్ స్పందిస్తూ పైవిధంగా పేర్కొన్నాడు. తీవ్రవాదులకు సంబంధించిన వార్తలు ఏమయినా ఉంటే జుకెర్ తొలగిస్తుండటం వల్లనే ఇలాంటి వ్యాఖ్యలు వారు పోస్ట్ చేసి ఉంటారని అంటున్నారు.