Saturday, 22 November 2014

సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి.. 52 ఏళ్ల మహిళ మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని బదయూ జిల్లా బిసౌలి ప్రాంతంలో జరిగింది.
మదన్ లాల్ జూనియర్ కాలేజి ప్రాంగణంలో జరిగిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో షర్బతీదేవి అనే మహిళ తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రిలో చేర్చినట్లు ఏఎస్పీ బలేంద్ర భూషణ్ సింగ్ చెప్పారు.
22 Nov 2014