Saturday, 10 September 2016

చెట్టినాడ్ మసాలా చికెన్ బిర్యాని 

కావలసినవి: 
చికెన్-200 గ్రా
బాస్‌మతి రైస్-400 గ్రా (పలుకుగా ఉడికించాలి)
నెయ్యి-25 గ్రా, 

కాశ్మీరీ మిర్చి-4 గ్రా, 
ఉప్పు-4 గ్రా
పుదీనా ఆకులు-5 గ్రా, 

వేయించిన ఉల్లిపాయ తరుగు-5 గ్రా
కొత్తిమీర-కట్ట, కరివేపాకు-ఒక రెమ్మ, 

పెరుగు-ఒక కప్పు 

మసాలాకోసం: 
ఏలకులు-2 గ్రా, 

దాల్చిన చెక్క-2 గ్రా, 
లవంగాలు-2 గ్రా
బిర్యాని ఆకు-2 గ్రా, 

సోంప్-4 గ్రా, 
ధనియాలు-6 గ్రా, 
జీలకర్ర-3 గ్రా
మిరియాలు-2 గ్రా, 

ఎండుమిర్చి-రెండు
పచ్చికొబ్బరి తురుము-20 గ్రా, 

నక్షత్ర లవంగాలు-1 గ్రా

తయారి: 
1. ముందుగా చికెన్‌ని తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 

2. ఒక పాన్‌లో పైన మసాలా కోసం చెప్చిన దినుసులను, పచ్చికొబ్బరి వేసి రోస్ట్ చేసి వేడి తగ్గిన తరవాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని చెట్టినాడ్ మసాలా అంటారు. 
3. పక్కన వేరొక పాన్‌లో చికెన్ ముక్కలు, పెరుగు, పుదీనా, కరివేపాకు, కాశ్మీరీమిర్చి, తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి దగ్గరగా వచ్చే వరకు ఉడికించాలి. 
4. అందులో పైన పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని కలిపి కాస్త వేయించిన తర్వాత ఉడికించిన రైస్, వేయించిన ఉల్లిపాయ తరుగును కలిపి సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుని పైన కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఈ బిర్యానీని రైతాతో తింటే మంచి రుచిగా ఉంటుంది.