క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ మధ్య లవ్ ఎఫైర్ ఉన్న విషయం ప్రపంచమంతా తెలిసిన విషయమే. వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో చెట్టాపట్టాలు వేసుకుని పబ్బులు, క్లబ్బులు, విదేశాలకు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఏదో వారి బాధ వారు పడుతున్నారు. అయితే ఈ మీడియా వాళ్ళకి వేరేపని లేనట్టు, వారికి ఈ విషయం గురించి అసలేమీ తెలియనట్టుగా విరాట్ కోహ్లీ ఎక్కడ కనిపించినా ‘మీకూ అనుష్క శర్మకు మధ్య ఏదో ఉందంటగా?’ అని ప్రశ్నిస్తూ వుంటారు. ఈ ప్రశ్నని మీడియావాళ్ళ చేత ఎన్నిసార్లు అడిగించుకుని విసుగెత్తిపోయాడోగానీ విరాట్ కోహ్లీ ఈ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. ‘‘ఎస్.. నేను అనుష్క శర్మని ప్రేమిస్తున్నాను. ఈ విషయం అందరికీ తెలిసిందే. దీన్ని మేమేం దాచడం లేదు. కాబట్టి నన్ను మాటమాటకీ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఈ విషయం గురించి ప్రశ్నించేవాళ్ళు కాస్తంత ఇంగితజ్ఞానంతో ఆలోచించి ఈ విషయంలో నన్ను మరోసారి ప్రశ్నించకండి’’ అన్నాడు. ఇప్పటి వరకూ ఆ ప్రశ్నని అడిగినవాళ్ళు ఇప్పటికైనా విరాట్ కోహ్లీ చెప్పినట్టు ఇంగితజ్ఞానం తెచ్చుకోవడం మంచిదేమో!
kohli confirms relationship with actress - అనుష్క, నేను ప్రేమించుకున్నాం.. సో వాట్?