మొన్నే చెల్లి పెళ్లిని ఘనంగా చేసిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. అందరూ అనుకున్నట్లుగానే ఆ పెళ్లికి తన ప్రియురాలు, రుమేనియన్ గాళ్‌ఫ్రెండ్ లూలియా వాంటుర్ని ఆహ్వానించాడు. అంతేకాదు.. ఆమెని తన సన్నిహిత మిత్రులు, కుటుంబానికి కూడా పరిచయం చేశాడని ముంబై మీడియా టాక్. 1980ల నుంచి సల్మాన్ ప్రతీ కదలికపై మీడియా ఓ కన్నేస్తూనే వస్తోంది. అప్పట్లో సంగీతా బిజ్లానీతో పెళ్లి కుదిరినప్పటికీ అది పెళ్లిపందిరి వరకు రాలేదు. ఇక అది మొదలు ఆయన గాళ్‌ఫ్రెండ్స్ జాబితా పెరుగుతూ వచ్చింది. కొన్నాళ్లు ఐశ్వర్యా రాయ్, కరీనా కపూర్ పేర్లు వినిపించగా ఇంకొన్నాళ్లు కత్రినా కైఫ్, డైసీ షా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. ఇలా రకరకాల పేర్లు ఆ జాబితాలో చేరిపోయాయి.
సీజన్కొక గాళ్‌ఫ్రెండ్ పేరు వినిపించడం.. పెళ్లి అవుతుందని టాక్ రావడం.. అది యధావిధిగానే పెళ్లివరకు రాకుండానే బ్రేకప్ అవడం.. ఇలా సల్మాన్ ప్రతీ లవ్‌స్టోరీలో జరిగింది ఒకటే. మరి ఈసారైనా లూలియా వాంటుర్తో బంధం పెళ్లి వరకు వస్తుందో లేదో వేచిచూడాల్సిందే మరి!
Home
»
»Unlabelled
» Salman khan introduces Lulia vantur - అనుకున్నంత పనిచేశాడు
Friday, 21 November 2014