Saturday, 22 November 2014

భారత క్రికెట్ జట్టు శనివారం ఆస్ట్రేలియా చేరుకుంది. ముంబై నుంచి బయల్దేరిన టీమిండియా సభ్యులు సింగపూర్ మీదుగా అడిలైడ్ చేరుకున్నారు.  ప్రస్తుత భారత జట్టులో ఎక్కువగా యువ ఆటగాళ్లు ఉన్నారు.

ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ నాలుగు టెస్టుల సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 14న బ్రిస్బేన్ లో తొలి టెస్టు ఆరంభంకానుంది. టెస్టు సిరీస్ ముగిశాక ఆసీస్, ఇంగ్లండ్ లతో కలసి ముక్కోణపు వన్డే సిరీస్ ఆడనుంది. ఆ వెంటనే వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ఆస్ట్రేలియాలో ప్రపంచ కప్ ఆరంభంకానుంది. భారత జట్టు సుదీర్ఘకాలం పాటు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.
22 Nov 2014