Friday, 21 November 2014

ఆగడు మూవీ షాక్‌తో ఆచితూచి అడుగేస్తున్న మహేష్‌బాబు ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో కొత్త సినిమా చేస్తున్నాడు. శృతి‌హసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ పూణెలో రెండో షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఐతే, శృతి ఎంటర్ తర్వాత ఈ షెడ్యూల్‌కు మధ్యలో హ్యాండిచ్చి విజయ్- శ్రీదేవి- హన్సిక‌లతో చేస్తున్న తమిళ ఫాంటసీ మూవీ షూట్‌కు శృతి జంప్ అయిందని ఇన్‌సైడ్ టాక్. 

మహేష్ సినిమాకి కొన్ని సీన్స్, ఓ సాంగ్ సగం వరకు మాత్రమే శృతి చేసిందట. డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు ఈ చిత్రానికి డేట్స్ లేవని అప్పటివరకూ మిగతా సీన్స్‌తో మేనేజ్ చేయాలని యూనిట్ డిసైడ్ అయినట్టు సమాచారం. ఒకవిధంగా మహేష్‌కు శృతిహాసన్ బాగానే ట్రబుల్ ఇస్తోందని ప్రచారం సాగుతోంది. ఎలాంటి హైప్ లేకుండా డీసెంట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ మూవీని డైరెక్టర్ శివ జాగ్రత్తగా డిజైన్ చేస్తున్నాడని సమాచారం.