Tuesday, 18 August 2015

పెసరపప్పు స్వీట్ రిసిపి : శ్రావణ మాసం స్పెషల్

కావల్సిన పదార్థాలు:
పెసరపప్పు: 2 cup 
కొబ్బరి - 1 cup 
బెల్లం - 1 cup 
యాలకలు - 4 to 5 
పాలు - 1 
ఎండు ద్రాక్ష - 10 
జీడిపప్పు - 10 
నెయ్యి:- 5 tbsp 
తయారుచేయు విధానం: 
1. ప్రెజర్ కుక్కర్లో నెయ్యి వేసి వేడి అయ్యాక అందులో పెసరపప్పు వేసి లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి. 
2. తర్వాత అందులో ఒక కప్పు పెసరపప్పుకు మూడు కప్పుల నీళ్ళు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. 
3. మరో పాన్ తీసుకొని అందులో ఒక కప్పు బెల్లం కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలపాలి. బెల్లం కరిగే వరకూ కలియబెడుతుండాలి. ఈ బెల్లంను నీళ్ళను స్టౌ మీద పెట్టి కొద్ది సమయం ఉడికించి తర్వాత క్రింద దింపుకొని చల్లార్చుకోవాలి. 
4. ఇప్పుడు మిక్సీలో కొబ్బరి తురుము మరియు యాలకలు వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. 5. తర్వాత కుక్కర్ లో ఆవిరి తగ్గి చల్లబడిన తర్వాత మూత తీసి అందులో బెల్లం మిశ్రమం మరియు కొబ్బరి పేస్ట్ వేసి మిక్స్ చేయాలి. 
6. అలాగే ఇందులో రెండు కప్పుల పాలు పోసి మిక్స్ చేయాలి. 
7. మరో చిన్న పాన్ లో నెయ్యి వేసి కాగిన తర్వాత అందులో ఎండు ద్రాక్ష, జీడిపప్పు, వేగించుకొని తర్వాత పెసరపప్పు కుక్కర్ లో వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి. అంతే హాట్ అండ్ టేస్టీ మూగ్ దాల్ స్వీట్ రిసిపి రెడీ.