Thursday, 13 November 2014


తన బాల్యమిత్రుడు వినోద్ కాంబ్లీ క్రికెట్ జీవితం అర్థాంతరంగా ముగియడానికి, అతను పెడదారి పట్టడానికి కారణం ఎవరు? అనే అంశంపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు. కాంబ్లీ ప్రతిభ గురించి నేను ఏమీ మాట్లాడను. కానీ, జీవన విధానం విషయంలో మాత్రం కాంబ్లీది ఒక శైలి, నాది మరోశైలి అని చెప్పాడు. కాంబ్లీకి, తనకు అనే విషయాల్లో భిన్నత్వం ఉందన్నారు. 
 
అయితే, తన విషయంలో తన తల్లిదండ్రులు ప్రతి దశలో తనపై కన్నేసి ఉంచారని... ఈ విషయంలో కాంబ్లీ గురించి తానేమీ మాట్లాడలేనని చెపుతూనే.. ఒక రకంగా కాంబ్లీ తప్పుదోవ పట్టకుండా నిరోధించడంలో అతని తల్లిదండ్రులు విఫలమయ్యారనేలా సచిన్ వ్యాఖ్యానించాడు. కాగా, రెండు వరుస టెస్టుల్లో డబుల్ సెంచరీలు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన కాంబ్లీ... కేవలం 17 టెస్టులు మాత్రమే అడారు. కాంబ్లీ చివరి టెస్ట్ మ్యాచ్ 23 ఏళ్ల వయసులో ఆడాడు. 
 
ఇదిలావుండగా, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత కార్యదర్శి మనోజ్ వారియా గురువారం నెల్లూరు జిల్లా పుట్టంరాజువారి కండ్రిగ వచ్చారు. ఈ సందర్భంగా సచిన్ దత్తత గ్రామాన్ని కార్యదర్శి పరిశీలించారు. ఈ నెల 16న సచిన్ గ్రామానికి రానున్న నేపథ్యంలో గ్రామస్థులతో చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన క్రమంలో రాజ్యసభ సభ్యుడిగా సచిన్ కండ్రిగ గ్రామాన్ని దత్తత చేసుకున్నారు.