Thursday, 13 November 2014


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్ చెల్లెలు వివాహం ఈ నెల 17, 18వ తేదీలలో హైదరాబాద్ లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాహ వేడుకకు కేవలం 200 నుండి 250 మంది ప్రముఖులను మాత్రమే ఆహ్వానించారు. ఆహ్వానితుల జాబితాలో సినిమా, రాజకీయ ప్రముఖులు ఉన్నారు.

అత్యంత వైభవంగా జరుగనున్న ఈ వివాహంపై అందరి చూపు నెలకొని ఉంది. సల్మాన్ కుటుంబం అతిధులకు ఆహ్వానాలు పంపింది. తెలుగు చిత్ర పరిశ్రమలో పలువురు ప్రముఖులతో సల్మాన్ ఖాన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీరిలో సల్మాన్ ఆహ్వానం అందుకున్న హీరోలు ఎవరు..? అని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు.