Wednesday, 19 November 2014


రామయ్య వస్తావయ్యతో తానూ గబ్బర్ సింగ్ సినిమాతో సంపాదించుకున్న క్రెడిట్ అంతా పోగొట్టుకున్న హరీష్ శంకర్ ప్రస్తుతం సాయి ధరం తేజ్ చిత్రం స్క్రిప్ట్ కోసం కష్ట పడుతున్నాడు. ఒక మసాలా ఎంటర్టైనర్ ని సాయికి ఇచ్చి మళ్ళీ తానూ కూడా ఫార్మ్ లోకి రావాలని ఆశ పడుతున్న హరీష్ శంకర్ ఈ సినిమాకి కూడా రేజీనాని హీరోయిన్ గా తీసుకునే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. ఇప్పటికే అల్లు శిరీష్ తో, సాయితో నటించి మెగా హీరోయిన్ గా ముద్ర వేయించుకున్న రేజీనా మరొక సినిమా ఈ కొత్త మెగా హీరోతో చెయ్యడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అని సమాచారం.