ప్రముఖ హీరో విక్టరీ వెంకటేశ్ కు జీహెచ్ ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) అధికారులు నోటీసులు జారీ చేశారు. అనుమతి లేకుండా ప్లాటులో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారన్న ఆరోపణల మేరకు ఆయనకు జీహెచ్ ఎంసీ సర్కిల్-10 టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు పంపించారు.
ఫిలింనగర్ రోడ్ నెంబర్.1 లో హీరో వెంకటేశ్ కు ప్లాటు ఉంది. గత కొద్దిరోజులుగా ఆ ప్లాటులో నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే జీహెచ్ ఎంసీ అనుమతి లేకుండానే ఈ నిర్మాణాలు జరుగుతుండటంతో వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులో పేర్కొన్నారు.
పది రోజుల్లోగా సమాధానం ఇవ్వకపోతే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని ఈ సందర్భంగా వారు వెంకటేశ్‌ను జీహెచ్ ఎంసీ అధికారులు హెచ్చరించారు.