రాజకీయాల్లోకెళ్ళాక క్షణం తీరిక లేకపోవడంతో ఫిజిక్ మీద కాన్సన్‌ట్రేషన్ పెట్టలేకపోయారు మెగాస్టార్ చిరంజీవి. కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా మాత్రమే కొనసాగుతున్నారు. సినిమాల్లో మళ్ళీ నటించాలనే ఆలోచనతో సినిమా కథల్ని వింటోన్న ఆయన, ఫిజిక్ మీద దృష్టిపెట్టినల్లుగా కనిపిస్తోంది. 'మేముసైతం' అంటూ హుద్‌హుద్ తుపాను బాధితుల్ని ఆదుకోవడానికి తెలుగు సినీ పరిశ్రమ చేపట్టిన కార్యక్రమం వివరాల్ని వెల్లడించేందుకు మీడియా ముందుకొచ్చిన చిరంజీవిని చూసి, 'చిరంజీవి సినిమా లుక్‌ని సంతరించుకున్నారు' అని అనుకున్నారు సినీ అభిమానులు.
న్యూ లుక్‌లో చిరంజీవి మునుపటి ఛార్మ్ కలిగి వున్నారనడం అతిశయోక్తి కాదు. కొంచెం సన్నబడటమే కాకుండా, చాలా రోజులుగా డాన్స్‌కి దూరమైన చిరంజీవి, వాటినీ తిరిగి ప్రాక్టీస్ చేస్తున్నారట. 150వ సినిమా ఎవరితో చిరంజీవి చేస్తారన్న ప్రశ్నకు సమాధానమైతే ఇప్పటివరకూ దొరకలేదుగానీ, నిర్మాతగా ఆయన కుమారుడి పేరు ఖరారైంది. గెటప్ కూడా మార్చినందున, అతి త్వరలో చిరంజీవి, మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఆ రోజు కోసం మెగా ఫాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. సినిమా లుక్‌తో అభిమానుల్లో జోష్ నింపిన చిరంజీవి, సినిమా కబురుని కూడా తొందరగా చెప్తే అభిమానులకు అంతకన్నా ఆనందం ఇంకేముంటుంది?