బూందీ లడ్డు :-
కావలసినవి:
శనగపిండి-కప్పు;
రవ్వ కేసరి - టీ స్పూన్;
ఏలకులపొడి-చిటికెడు;
బియ్యప్పిండి- టేబుల్ స్పూన్;
బేకింగ్ పౌడర్ - చిటికెడు;
ఎండు కర్బూజ గింజలు - టేబుల్‌స్పూన్;
జీడిపప్పు పలుకులు - టేబుల్ స్పూన్;
నూనె- 2 కప్పులు;
పంచదార-2 కప్పులు;
నీళ్లు - కప్పు.
తయారి:
1. శనగపిండి, బియ్యప్పిండి, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించి, తగినన్ని నీళ్లు పోసి, చిక్కటి మిశ్రమం తయారుచేయాలి.
2. కడాయి లో నూనె పోసి, కాగిన తర్వాత నూనెలో పడేలా సన్నని జల్లిలో పిండిమిశ్రమాన్ని పోస్తూ బూందీ చేయాలి.
3. కప్పు నీళ్లు పోసి పంచదార పాకం పట్టాలి. ఇందులో ఏలకుల పొడి వేసి కలపాలి. వేడిగా ఉన్నప్పుడే బూందీని పంచదార పాకం లో వేసి, బాగా కలపాలి.
4. తర్వాత తగినంత పరిమాణంలో జీడిపప్పులు చేర్చుతూ లడ్డూలు కట్టుకోవాలి.