ఆ కాయ చేదంటే చాలామందికా ప్రాణం. ఆ కాయలో కారం పెట్టి నూనెలో వేగిస్తే కాయపళంగా లాగించేస్తారు. ఆరోగ్యం కావాలంటే వంటల్లో ఆ కాయ ఉండాల్సిందే. ఆ కాయే.. కాకరకాయ. మెనూలో కాకరకాయ పేరు కనిపించగానే బాబోయ్... అనే పిల్లలకు ఆ చేదులో ఉండేకమ్మదనం రుచి చూపించే వంటలు......
కాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ కాకరకాయ చేదులో ఎన్నో తీయని గుణాలు ఉన్నాయి.
ఇది షుగర్ వ్యాది ఉన్నవారికి చాలా మంచి ఆహారం..
కావాల్సిన పదార్ధాలు:-
కాకరకాయలు - అర కేజీ
శనగపిండి - 100 గ్రాములు
కారం - 1 టీ స్పూన్
ఉప్పు - తగినంత
నూనె - అర కప్పు
పసుపు - అర టీ స్పూన్
తయారు చేయు విధానం:-
1. ముందుగా కాకరకాయలు నిలువుగా కట్ చేసి లోపలి గింజలు తీసి నాలుగు వైపులా కట్ చేసుకోవాలి (పూర్తిగా కాకుండా గుత్తి వంకాయలాగా కట్ చేసుకోవాలి.)
2. ఈ కాకరకాయలను నీళ్లలో వేసి, పసుపు వేసి ఉడికించి నీళ్లు తీసి పక్కన పెట్టుకోవాలి.
3. శనగపిండిలో కారం, ఉప్పు, కొద్దిగా నూనె వేసి తడిపొడిగా కలపాలి. ఈ శనగపిండి మిశ్రమాన్ని ఉడికించిన కాకరకాయలలో కూరుకోవాలి (గుత్తి వంకాయలలో మసాల కూరినట్లు)
4. ఇప్పుడు కడాయిలో నూనె వేసి నూనె కాగిన తరువాత కాకరకాయ ముక్కలను ఒక్కొక్కటిగా వేసి విడిపోకుండా జాగ్రత్తగా తిప్పుతూ ఫ్రై చేయాలి కాకర కాయలు బాగా ఎర్రగా వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి చేదు లేకుండా తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది.