Tuesday, 18 November 2014


ప్రకాశం జిల్లాలో ఓ మహిళా లెక్చరర్ ఆత్మహత్య చేసుకుంది. అద్దంకిలోని స్థానిక ఓ జూనియర్ కళాశాలలో ఫిజిక్స్ లెక్చరర్ గా‌ పనిచేస్తున్న అంజలిదేవి, ల్యాబ్ లో ఉరేసుకుంది. మంగళవారం ఉదయం కళాశాలకు వచ్చిన విద్యార్థులు.. ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకుని ఆమె మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. 

సోమవారం సాయంత్రం ల్యాబ్ లో ఆమె సూసైడ్‌కు పాల్పడి వుండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం అంజిలిదేవి మృతదేహాన్ని ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు మృతురాలి కుటుంబసభ్యులను, కళాశాల సిబ్బందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అంజలిదేవి ఆత్మహత్య వెనుక పూర్తి కారణాలు తెలియాల్సివుంది.