Thursday, 6 November 2014

రుణమాఫీ మీద ఈరోజైనా



ఎలక్షన్లకు ముందు మీరు ఒక్క రూపాయి కూడా బ్యాంకుకు కట్టవద్దు, నేనొస్తా సంపూర్ణ రుణమాఫీ చేస్తా అని ఊదరగొట్టిన చంద్రబాబు ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు ఉండడమేకాక ఈరోజు రాష్ట్రం ఉన్న పరిస్థితులు అని ఏవేవో కల్లబుల్లి కబుర్లు చెప్తున్నాడు. ఆయనకీ తగ్గట్టే ఆయన మంత్రి వర్గం కూడా ఎప్పుడూ ఏదోక సంచలన ప్రకటన చేసి ఆ తరువాత దాని ఊసేలేకుండా నిశబ్ధం పాటిస్తుంటారు.
      అయితే ఇప్పటికే ఎన్నో గడువులు పెట్టి ప్రతిసారీ ఏదోకటి చెప్పి తప్పించుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం ఈ సారి ఇచ్చిన గడువు నవంబర్ 5 తారీకు రానే వచ్చింది. మరి ఎసారైన ఆయన చెప్పిన 25% రుణమాఫీ అవుతుందో లేదో అని రైతన్నలు ఎదురుచూస్తున్నారు.
      ఒకవైపు రుణాలు కట్టమని బ్యాంకులు, కట్టొద్దు మేము కడతామని ప్రభుత్వం, మరోపక్క పొలానికి కావాల్సినవి తెచ్చుకోవాలంటే దొరకని బ్యాంకు రుణం.... ఇలా తెలుగు రైతు చితికిపోతున్న తరుణంలో కల్లబుల్లి మాటలు కట్టిపెట్టి రైతన్నని ఒడ్డున పడేసే ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుందో లేదో!!!