Friday 9 September 2016

కోడిగుడ్డు మునక్కాయ పులుసు::
కావలసిన పదార్థాలు: 
మునక్కాయలు - నాలుగు,
కోడి గుడ్లు - ఐదు,
ఉల్లిపాయలు - మూడు,
చింతపండు - 20 గ్రాములు,
అల్లంవెల్లుల్లి ముద్ద - రెండు టీ స్పూన్లు,
కరివేపాకు - రెండు రెబ్బలు,
ఉప్పు - తగినంత,
ఎండు మిరపకాయలు, - రెండు,
జీలకర్ర - అర టీ స్పూను,
ఆవాలు - అర టీ స్పూను,
నూనె - సరిపడా,
కొత్తిమీర - ఒక కట్ట.

తయారుచేయు విధానం: 
1. కోడి గుడ్లని ఉడికించి పెచ్చు తీసి పక్కన పెట్టుకోవాలి. మునక్కాయలపై పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2. మిక్సీలో ఉల్లిపాయముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి మెత్తగా రుబ్బుకోవాలి. చింతపండుని ఒక గిన్నెలో నానపెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి ఉడికించిన గుడ్లని వేసి ఎర్రగా వేగించుకోవాలి.
4. వాటిని తీసిన నూనెలో ఉల్లిపాయముద్ద వేసి వేగించాలి. ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలపాలి. ఇందులో మునక్కాయ ముక్కలు, కోడిగుడ్లు కూడా వేసి కలిపి ఓ ఐదు నిమిషాలు వేగించాలి.
5. తరువాత నానబెట్టిన చింతపండులో ఒక గ్లాసు నీళ్లు పోసి గుజ్జు తీయాలి. ఈ నీళ్లని కూరలో పోసి మరో పది నిమిషాలు ఉడికించాలి.
మునక్కాయ ముక్కలు మెత్తపడ్డాక కొత్తిమీర తురుము వేసి దింపేయాలి.