Tuesday 27 October 2015

టీ త్రాగటం వలన చర్మం నల్లగా మారుతుంది అనేది ఒక అపనమ్మకం మాత్రమే. 
చర్మం శరీర ఆకృతి, రూపు రేఖల పైన మాత్రమె చర్మ రంగు ఆధారపడి ఉంటుంది మరియు మీ చర్మం రంగు మారటానికి మీరు త్రాగే టీ మాత్రం ముమ్మాటికి కారణం కాదు. 

టీ, కాఫీ లేదా కెఫీన్ అధికంగా ఉండే వంటి ద్రావణాలు మీ చర్మాన్ని ఏ విధంగాను ప్రభావితం చేయవు.
 పండ్లు, కూరగాయలలో ఉన్నట్లుగానే టీలో కూడా చాలా రకాల యాంటీ-ఆక్సిడెంట్'లు ఉంటాయి. 

యాంటీ-ఆక్సిడెంట్'లు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం మరియు గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్'ల అభివృద్ధిని నిరోధిస్తాయి.

అంతేకాకుండా టీని మాములుగా కాకుండా అధికంగా త్రాగటం వలన చర్మాన్ని డీ హైడ్రేషన్'కు గురి చేసి, చర్మ రంగును మారుస్తుంది. 

డీ-హడ్రేషన్'కు గురి అయిన చర్మ కణాలు చూడటానికి పొడిగా, నిర్జీవంగా కనిపిస్తాయి, దీని వలన చర్మం నల్లగా మారుతుంది. 

అయినప్పటికి, టీ వలన చర్మం నల్లగా మారదు, కారణం ఈ పద్దతి ప్రకారం చర్మం నల్లగా మారటానికి ఎక్కువ సమయమే పడుతుంది. 

రోజులో ఎక్కువ మొత్తంలో టీ త్రాగటం వలన చర్మం నల్లగా మారే అవకాశం ఉంది అని నిపుణులు తెలుపుతున్నారు, మీ చర్మం నల్లగా మారటానికి టీ కారణం కాకపోవచ్చు.

 నిద్ర లేకపోవటం, ఒత్తిడి లేదా ఇతర ఆరోగ్య సమస్యల వలన కుడా చర్మం నల్లగా మారే అవకాశం ఉంది.
Tea

చర్మంలో మార్పులు జరిగితే చాలు టీ వలన అని చెప్పటం అందరికి చాలా సాధారణం అయిపొయింది. 

అంతేకాకుండా, సూర్యరశ్మికి బహిర్గతం అవటం, కొన్ని రకాల చర్మ సమస్యల వలన కుడా చర్మ రంగులో మార్పులు రావచ్చు. 

చర్మం అనారోగ్యానికి గురి అవటం లేదా చర్మ రంగు మారటానికి సూర్యరశ్మి ఒక కారణంగా చెప్పవచ్చు. 

నిజమైన చర్మ రంగు, వ్యక్తి యొక్క జన్యువులు మరియు అతడు సూర్యరశ్మికి బహిర్గతం అయ్యే స్థాయిలను బట్టి చర్మ రంగు మారుతుంది.

చర్మ రంగు మారటానికి గల కారణాలు:

టీ ఎక్కువగా త్రాగటం వలన చర్మ రంగు మారుతుంది అని భావిస్తున్నారో, అతడి చర్మ రంగు మారటానికి టీ కారణం అని చెప్పటం సరి అయినది కాదు. 

చర్మ రంగు మారటానికి ఇతర కారణాలు,కారకాలు అని చెప్పవచ్చు, ముఖ్యంగా ఇతర వ్యాధులు, గుర్తింపబడని వ్యాధులు, లేదా ఆరోగ్య విషయంలో కలిగే చిన్న చిన్న మార్పులు వంటివి చర్మ రంగు మారటానికి కారణాలుగా చెప్పవచ్చు. 

సాధారణంగా ఎక్కువ ఉద్రేకానికి గురి అవటం వలన కూడా చర్మ రంగు మారే అవకాశం ఉంది, కొన్ని సార్లు ఎవరయితే ఉన్నట్టుండి ఎక్కువ ఉద్రేకతకు గురి అవుతారో, వారు టీ త్రాగటం వలన మామూలు స్థితికి వస్తుంటారు. 

ఒత్తిడి మరియు ఉద్రేకాలకు లోనవటం వలన కాలేయ విధి నిర్వహణలో ఆటంకాలు ఏర్పడి, చర్మం నీలి పసుపు పచ్చ రంగులోకి మారి, జాండీస్ వంటి వ్యాధులు కలిగే అవకాశం ఉంది. 

శరీరంలో జరిగే చిన్న చిన్న మార్పుల వలన చర్మ రంగు మారవచ్చు అని నిపుణులు చెపుతున్నారు. 

టీ ఎక్కువగా త్రాగేవారు ఉద్రేకతకు లోనయినపుడు, మితిమీరిన మోతాదులో టీ త్రాగే అవకాశం ఉంది, చర్మంలో కలిగే మార్పులు లేదా రంగుల మార్పు గురించి ఇక్కడ తెలుపబడింది.

లేత రంగు చర్మంఉద్రేకతలకు లోనవ్వటం వలన చర్మం లేత రంగులోకి మారుతుంది లేదా లేత రంగులో కనపడుతుంది. 

ఎక్కువ ఉద్రేకతలకు లోనయ్యేవారిలో ఇవి చాలా సాధారణం అని చెప్పవచ్చు. 
ఇది కలుగుటకు కారణం-శరీర చర్మం నుండి గుండెకు వెళ్ళే రక్తంలో రాషేస్ రావటం వలన రక్తంలో ఉండే సహజ సిద్ద వర్ణ ద్రవ్యాలను కోల్పోవటం వలన శరీర చర్మం లేత రంగులోకి మారే అవకాశం ఉంది.
Drinking tea

ఎరుపు చర్మం

ఉద్రేకతకు లోనయినపుడు చర్మం ఎరుపు రంగులోకి మారే అవకాశం ఉంది ముఖ్యంగా మెడ మరియు ముఖం పైన ఉండే చర్మం ఎరుపుగా మారవచ్చు. 

చర్మ కణాలలో ఉండే క్యాపిల్లరీలోకి అధిక రక్తం చేరటం వలన చర్మం ఎరుపు రంగులోకి మారే అవకాశం ఉంది.

ముదురు చర్మంముఖ్యంగా కొంత మందిలో, ఉద్రేకతకు మరియు వీటి సంబంధిత వ్యాధులకు గురి అవటం వలన చర్మం ముదురు రంగులోకి మారుతుంది. 

కొంత మంది ఎక్కువ టీ త్రాగటం వలన ఇలా జరిగి ఉంటుంది అని భ్రమపడుతుంటారు.

టీ వలన చర్మం రంగు మారుతుంది అని నమ్మటం చాలా తప్పు మరియు ఇది పూర్వకాలం నుండి నమ్ముతున్న ఒక అసత్యంగా పరిగణించవచ్చు. 

టీ త్రాగటం వలన శరీరానికి చాలా రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. 

అంతేకాకుండా, ఒకవేళ ఎలాంటి కారణం లేకుండా అనగా సూర్యరశ్మికి బహిర్గతం అవకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్నపుడు కూడా మీ చర్మం రంగు మారినట్లయితే, వెంటనే వైద్యుడిని సంప్రదించి కారణం తెలుసుకోండి.