Saturday 22 November 2014


రాష్ట్రపతి పాలన పెట్టే ధైర్యం ఉందా అంటూ పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.  
 
సెక్యులరిజం మీద ఏర్పాటైన సదస్సుకు హాజరుకావడం వల్లే తమ పార్టీ ఎంపీ శ్రింజయ్ బోస్ ను అరెస్టు చేశారని ఆమె ఆరోపించారు. ఇలాంటి సదస్సులకు వేలసార్లు తాను హాజరవుతానని స్పష్టం చేశారు. ధైర్యముంటే పశ్చిమబెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలని మమత సవాలు విసిరారు.
 
తమపై దాడులకు దిగితే తాము ఊరుకోబోమని, అన్ని రకాల సవాళ్లను ఎదుర్కోడానికి తాను సిద్ధమని తెలిపారు. ఇక సీబీఐ తీరుపై కూడా మమతాబెనర్జీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా అనేక అల్లర్లు జరిగాయని గుర్తు చేశారు.